Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్ కి కటింగ్ మిషన్‌తో చోరీలకు పాల్పడ్డ నిందితుడు
- 13 ద్విచక్ర వాహనాలు, ఒక ఐ20 కారు, కీ కటింగ్ మిషన్, ఒక సెల్ ఫోన్, నాలుగు డూప్లికేట్ కీలు స్వాధీనం
- పాత నేరస్థుడితోపాటు ఐదుగురి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
నవతెలంగాణ-వనస్థలిపురం
ఆధునిక విజ్ఞానంతో కొత్త పంథాలో పాత నేరస్తుడు వన్ కి కటింగ్ మిషన్‌తో కీలు తయారుచేసి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడ తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలు, ఒక ఐ20 కారు, వన్ కి కటింగ్ మిషన్, ఒక సెల్ ఫోను, నాలుగు డూప్లికేట్ కీలును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కి తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో జరిగింది. వనస్థలి పురం ఏసీబీ కార్యాలయంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం-మహబూబ్‌నగర్ దేవరకొండ మండలానికి చెందిన బందర్ వాలి రాకేష్ (21) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండేవాడు, హస్తినా పురం క్రిస్టియన్ కాలనీ ప్లాట్ నెంబర్ 17 లో నివసిస్తూ గతంలో ఇదేవిధంగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాటుపడి జైలుకు వెళ్లి వచ్చాడు. నేరప్రవృత్తిని మార్చుకోకుండా కొత్త పంథాల్లో ద్విచక్ర వాహనాన్ని చోరీలకు పాల్పడాలన్న ఆలోచనతో వనస్థలిపురం సుష్మ థియేటర్ చౌరస్తా వద్దనున్న ఫేమస్ కి మేకింగ్ షాప్ యజమాని మహమ్మద్ సోహెల్ ఖాన్‌తో పరిచయం పెంచుకుని వన్ కి కటింగ్ మిషన్ ద్వారా డూప్లికేట్ కీలు తయారుచేసి వనస్థలిపురంలో ఏడు ద్విచక్ర వాహనాలు, ఎల్బీనగర్లో రెండు ద్విచక్ర వాహనాలు, సరూర్‌నగర్‌లో ఒక వాహనం, సైదాబాద్‌లో ఒక వాహనం ఇదేవిధంగా చోరీలకు పాల్పడుతూ నిందితు డు రాకేష్ ఆ వాహనాలను ఎల్బీనగర్ రెడ్డి కాలనీ స్క్రాప్ బిజినెస్ చేస్తున్న అజరు(21), ఎల్బీనగర్ ఏపీఎస్ఈబి కాలనీ ఓంకార్ నగర్‌కు చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న శివ(20), గాయత్రినగర్ అంబేద్కర్‌నగర్ పాన్‌షాప్ నడుపుతున్న శివకుమార్ (22), మీర్పేట్ జనార్దన్ నగర్ కాలనీకి చెందిన సంతోష్ (21)లకు నిందితుడు రాకేష్ దొంగిలించిన వాహనాలను వారికి 20వేలు లేక15 వేలు రూపాయ లకు అమ్మి వేసి సొమ్ము చేసుకునేవాడు. గతంలో నిందితుడు రాకేష్ ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వనస్థలిపురం పోలీసులకి అడ్డంగా దొరికి జైలు పాలయ్యాడు. బుధవారం పోలీసులు వాహనాల చెకింగ్ నిర్వహిస్తుండగా అనుమానంతో సంచరిస్తున్న నిందితుడు రాకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడిందని, నిందితుడు వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడికి సహకరించిన మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీి పురుషోత్తంరెడ్డి తెలిపారు. నిందితుడు రాకేష్‌ని చాకచక్కంగా పట్టుకుని వాహనాన్ని రికవరీ చేసిన వనస్థలిపురం సీఐ కే సత్యనారాయణ, డీఐ వెంకటయ్య, క్రైమ్ ఎస్సై జగన్, క్రైమ్ కానిస్టేబుల్స్ లలిత కిరణ్, బాలరాజు, రాజేష్, అయోధ్య, ఉపేందర్‌లకు ఆయన రివార్డులను అందజేశారు.