Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి సాయినగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. విఘ్నేశ్వరుని చల్లని చూపు ప్రజలందరిపై తప్పక ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు కాసాని సుధాకర్, బాలాజీ నాయక్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, నాయకులు కోలన్ సునీల్ రెడ్డి, వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.