Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సాగిస్తున్నామని, త్వరలోనే పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్లా రూపుదిద్దుకుంటుందని మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. రూ.8 కోట్లతో చేపట్టిన బ్యూటిఫికేషన్ పనులను మేయర్ జక్క వెంకట్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అలువాల సరితా దేవేందర్‌గౌడ్‌తో కలిసి పరిశీలించారు. చెరువుల సుందరీ కరణలో భాగంగా...మినీ ట్యాంక్ బండ్లా తీర్చిదిద్దుతున్నారు. మేయర్ జక్క వెంకట్‌రెడ్డి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో వరదల కారణంగా చెరువుకట్ట తెగిపోవడంతో క్రింద ఉన్న కాలానీల ప్రజలు అనేక ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితి భవిష్యత్‌లో పునరావృత్తం కాకుండా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సహకారంతో ప్రభుత్వం హెచ్ఎండీఏ ద్వారా సుమారు రూ.5.4కోట్లతో ప్రత్యేక నిధులు కేటాయించి చెరువు చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా చెరువు వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు బతుకమ్మ ఘాట్, స్వాగత తోరణం, పిల్లలకు ప్లే ఏరియా, వ్యూ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల పూల మొక్కలతో గార్డెన్ ఏర్పాటు, అలాగే హైమాస్ లైట్లను అమర్చనున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరతగిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. మినీ ట్యాంక్‌బండ్ ఆహ్లాదంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చేలా రూపుదిద్దనున్నట్లు స్పష్టం చేశారు. మినీ ట్యాంక్ బండ్ పూర్తైతే... ఉదయపు నడకతో పాటు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే వీలుకలుగుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ డీఈ శివారెడ్డి, పీఎంసీ ఏఈ బిక్షపతి, నాయకులు ఆలువాల దేవేందర్ గౌడ్, జావీద్ ఖాన్ పాల్గొన్నారు.