Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ అబ్దుల్లా సాది
- ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ దినోత్సవం వేడుకలు
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల విద్యాభివృద్దికి అధిక ప్రాధాన్య ఇవ్వటం జరుగుతుందని జల్పల్లి మున్సిపల్ చైర్మెన్ అబ్దుల్లాసాది అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్లోని 21వ వార్డులోని వాది హే ముస్తఫా కాలనీలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మున్సిపల్ రిప్రజెంట్ వైస్ చైర్మెన్ యూసుఫ్ పటెల్,స్థానిక కౌన్సిలర్ షేక్ పమీద అప్జల్తో కలిసి పుడ్ ఫెస్టివల్ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సహకారంతో మున్సిపల్లో ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్ర మాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థు లు విద్యతోపాటు వివిధ వృత్తి విద్యా కోర్సులను తెలుసుకొని రాణించాలన్నారు. అదేవిధంగా విద్యాభివృద్ధితో పాటు మైనార్టీల కాలనీవాసులకు మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అందుకుగాను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఉపాధ్యక్షులు సయ్యద్ హుసేన్, 21వ వార్డు అధ్యక్షులు షేక్ సాలేహా భవజీర్, పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.