Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టూరిజం చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా
నవతెలంగాణ-సరూర్‌నగర్
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ పాల్గొనాలని టూరిజం అభివద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. గురువారం సరూర్‌నగర్‌లో గౌతమ్ వరల్డ్ విద్యాసంస్థలు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ద్రోణా యాన్వల్ స్పోర్ట్స్ మీట్ ప్రారం భోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని క్రీడాజ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టూరిజం చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుతోపాటు క్రీడలలో కూడా పాల్గొనాలని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రీడలకు, క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక నూతన స్టేడియం నిర్మిస్తున్నారు. ఆటలు, ఆటల పోటీలు క్రీడాస్ఫూర్తిని పెంచుతాయని, ప్రతి ఒక్కరూ కొంత సమయం ఆటల కోసం కేటాయిస్తే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని చెప్పారు. క్రీడాకారులు క్రీడల్లో రాణించి, వారి తల్లిదండ్రులకు, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ ప్రత్యూష, కవిత, ఉపాధ్యాయులు దీన, పద్మలత, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.