Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
డిజిటల్ తరగతులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గురువారం ప్రొఫెసర్ జి. రాంరెడ్డి దూరవిద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టూడియోను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ డైరెక్టర్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్తో కలిసి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన స్టూడియో సదుపాయాన్ని ప్రారంభించామని, విద్యార్థులకు టీశాట్, యూట్యూబ్ ద్వారా పాఠాలను అందించనున్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విద్యార్థులతో పాటు దూరవిద్య ద్వారా చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులను రూపొందించనున్నామని తెలిపారు.సెంటర్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఈ కంటెంట్ రూపొందించేందుకు కషి చేస్తుందని అన్నారు. యూనివర్శిటీకి, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం ద్వారా మరిన్ని సత్ఫలితాలు సాధించే అవకాశం ఏర్పడుతుందని ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పప్పుల. లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. నిత్యం అభివద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. సీడీఈటీ ఏర్పాటుతో విద్యను చేరుకోలేని వారికి అవకాశాలను చేరువ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీడీఈటీ డైరెక్టర్ ప్రొ. కె. స్టీవెన్సన్ మాట్లాడుతూ ఈ స్టూడియో సదుపాయం యూనివర్సిటీలోనే మొట్టమొదటిదని, ఉస్మానియా విద్యార్థుల కోసం, అలాగే బయటి ప్రపంచానికి డిజిటల్ కంటెంట్‌ను అందించాలనే ఏకైక లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దూర విద్య ద్వారా చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ పాఠాలను చేరువ చేసేలా డీటీఈటీ పనిచేయాలని పీజీఆర్ఆర్ సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.బి రెడ్డి ఆకాంక్షించారు. సీడీఈటీి జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ఆర్ గిరిధర్ సెంటర్ కార్యకలాపాలను వివరించారు.