Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాప్‌తో పారదర్శకత, సత్వర సేవలు
- రైతులకు వినియోగదారులకు మరింత దగ్గర అయ్యేందు కృషి
- పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట జనగామం, రంగారెడ్డి, కర్నూలు జిల్లాలో యాప్ అమలు
- అవకతవకల చెక్, ప్రతి 15 రోజులకు ఒకసారి రెమ్యునరేషన్: చైర్మెన్ సోమ భరత్
నవతెలంగాణ-ఓయూ
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పాల ఉత్పత్తిదారులు నేరుగా ప్రయోజనం పొందేందుకు, అవకతవకల నియంత్రణకు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫÛర్ (డీబీటీ) కోసం 'విజయ పాల మిత్ర' మొబైల్ యాప్‌ను తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీఎస్ డిడిసిఎఫ్ఎల్) వారు లాలాపేట విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో చైర్మెన్ సోమ.భరత్ కుమార్, ఎండీ, రిటైర్డ్ ఐఏఎస్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధర్ సిన్హా ఆవిష్కరించారు.
పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయంగా
రాష్ట్రవ్యాప్తంగా 16 మిల్క్ షెడ్లలో సుమారు 5251 సహకార సంఘాల ద్వారా 1,43,265 మంది పాడిరైతుల నుంచి నిత్యం మూడు లక్షల లీటర్స్ పాల సేకరణజరుగుతుంది. వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయిదు లక్షల లీటర్ల సామర్థ్యంతో మెగా డెయిరీ నిర్మాణంలో ఉంది. తెలంగాణ జిల్లాల్లో పాల సేకరణ, శీతలీకరణ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ వంటి మౌలిక సదుపాయాలను ఇప్పటికే కలిగి ఉంది. దీంతో చిన్న, సన్నకారు రైతులు, మహిళా పాల ఉత్పత్తిదారులు, వ్యవసాయ కార్మికులకు ఎంతో మందికి జీవనోపాధి అందుతోంది. పాల ఉత్పత్తిదారుల పాల బిల్లులను సులభతరంగా అందుకునేందుకు కొత్త మొబైల్ ప్లాట్ ఫాంను నగరంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ( ఎన్ఐసీ), ద్వారా అభివద్ధి చేయించారు. దీని ద్వారా పాల ఉత్పత్తిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫÛర్ (డీబీటీ), అమలు చేసి నూతన మొబైల్ ప్లాట్ ఫారంను రెండు నెలలు శ్రమించారు.
యాప్ ముఖ్య ఉద్దేశాలు
- ప్రతి 15 రోజులకు పాల ఉత్పత్తిదారులు పాల బిల్లులను నేరుగా పాల రైతుల బ్యాంకు ఖాతాలలో జమచేయుట
- పాల కొనుగోలు కేంద్రంలో ప్రతి రోజు సేకరించిన పాల వివరాలు నమోదు చేయుట, వాటి నాణ్యత వివరాలు పొందుపరుచుట
- పాలు పోస్తున్న పాడి రైతుల కు మొబైల్ ద్వారా నిత్యం సందేశం పంపించుట
- 15 రోజులకు ఒక్కసారి నేరుగా నగదు జయ చేయు వివరాలు, మొబైల్ ద్వారా సమాచారాన్ని ఇవ్వడం
- పాల బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత, కొనుగోలు ,పెట్టుబడి వివరాలు సమర్ధవంతంగా నిర్వహించుట
- పాల ఉత్పత్తి దారులకు విధేయత విశ్వాసం, నమ్మకాన్ని రెట్టింపు చేయడం
- గ్రామాల్లో పాల సేకరణ మాన్యువల్ ఎంట్రీని నివారించేందుకు సహాయపడుతుంది.
ముందుగా మూడు జిల్లాల్లో..
విజయ పాల మిత్ర పేరుతో పాల ఉత్పత్తిదారులకు, గ్రామ పాల సేకరణ కేంద్రాలకు మొబైల్ అప్లికేషన్ అందుబాటులో ఉంచబడి దీని ద్వారా రైతులకు అందజేసే నగదు ప్రోత్సాహకం నేరుగా అందజేస్తారు. ముందుగా యాప్‌ను పైలెట్ ప్రాజెక్టులో బాగంగా జనగాం, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ మిల్క్ షెడ్లలో ప్రతి పాల కేంద్రం వద్ద ఒక గ్రామం చొప్పున బచ్చన్నపేట, చల్లంపల్లి, ఊర్కొండపేటలలో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
ఒక్క యాప్‌తో ప్రయోజనాలు
యాప్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రైతులను అధికారులను సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తు ప్రయోజనాలకు బాటలు వేస్తుందని నమ్మకంగా ఉన్నాం. పైలట్ ప్రాజెక్టులలో లోటుపాట్లు ఉంటే మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా యాప్‌ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తాం.
- చైర్మెన్ సోమ, భరత్ కుమార్