Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్పల్లి సమతా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఆర్బీఐ కాలనీలో ఉపాధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈసందర్భంగా ఉపాధ్యక్షులు ఇంద్రారెడ్డి రాంచందర్ రావుతో కలిసి సమతానగర్ అసోసియేషన్ 2023 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యదర్శి గొట్టపాటి నాగేశ్వరరావు 2022లో కాలనీలో చేపట్టిన పలు కార్యక్రమాల గురించి సవివరంగా వివరించారు. ఇంతేగాక నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవాన్ని విజయవంతంగా జరుగుటకు తోడ్పడిన మహిళా నాయకులు ప్రమీల, సుధా, సదాలక్ష్మి, స్రవంతి తదితరుల కృషిని కొనియాడారు. 2022లో అసోసియేషన్ జమ ఖర్చు వివరాలను కోశాధికారి అబ్బరాజు రామకృష్ణ సవివరంగా తెలియజేశారు. సమావేశంలో సహాయ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, చంద్రమోహన్, యువజన కార్యవర్గం రాకేష్, రాధాకృష్ణ, శ్రీనివాస్, శ్రవణ్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.