Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తార్నాకలోని లాలాపేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎర్పాటు చేసిన జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాను తప్పనిసరిగా ఇప్పించాలన్నారు. భవిష్యత్లో హెపటైటీస్, పోలియో, తదితర దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా చిన్నారులకు టీకాలు ఇప్పించాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా టీకాలను ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ సరిత, సూపర్వైజర్ స్వరూప, నర్సులు గీత, సత్య, హాస్పిటల్ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.