Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరి యంలో బుధవారం రాత్రి రెండో రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్లోబల్ అలూమ్ని ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిం చారు. ఉస్మానియాలో చదువుకుని పారిశ్రామిక దిగ్గజా లుగా ఎదిగిన వారు ఉస్మానియాతో పరస్పర అవగాహనా ఒప్పందాలు చేసుకున్నారు. దాదాపు రూ.8 లక్షల విలువైన స్కాలర్ షిప్పులను పూర్వ విద్యార్థులు ప్రకటించారు. ఆయా విభాగాలకు పూర్వ విద్యార్థులు రూ.దాదాపు 2 కోట్ల వరకు విరాళాలు ఇచ్చారని ఓయూ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అకాడమియా అండ్ ఇండిస్టీ లింకేజీ అనే అంశంపై రరెండో రోజు మొదటి ఫ్యానల్ డిస్కషన్ నిర్వహించారు. ఈ చర్చకు భాను ప్రకాశ్ వర్ల మోడరేటర్‌గా వ్యవహరించారు. క్యావియం నెట్ వర్క్స్ సీఈఓ సయ్యద్ బషరత్ అలీ, ఓయూ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్ మెంట్ బోర్డ్ మెంబర్ డాక్టర్ రాజు ఎస్.గన్నవరపు, టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస రావు, సోలిక్స్ టెక్నా లజీస్ సీఈఓ సాయి గుండవల్లి, ప్రొ.కృష్ణారెడ్డి సహా పలు కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. రెండో బృంద చర్చలో భాగంగా ఉస్మానియా అల్యూమినీ కనెక్ట్ టు రి కనెక్ట్ తో పాటు ఉన్నత విద్య-సవాళ్ల అనే అంశంపై తెలంగాణ యూనివర్సిటీ వీసీలు, మాజీ వీసీ లు పాల్గొన్నారు. ప్రొ.ఘంటా చక్రపాణి ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహ రించారు. దాదాపు 12 మంది వీసీలు పాల్గొన్న బృంద చర్చా వేదికపై ఒక్క మహిళ కూడా లేకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వీసీ, మణి పూర్ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.తిరుపతిరావు, విశ్రాంత వీసీ ప్రొ.సులేమాన్ సిద్ధిఖీ, శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.మల్లేశం, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.కిష న్‌రావు, మాజీ వీసీలు, ప్రస్తుత వీసీలు ప్రొ.భాగ్యనారాయ ణ, ప్రొ.సత్యనారాయణ, ప్రొ.రామచంద్రం, ప్రొ.రవిందర్ గుప్త, ప్రొ.సీతారామరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి, పొ.వెంకటరమణ, ప్రొ.కృష్ణ దేవరాయ చర్చలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ డి. రవిందర్ యాదవ్, రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీ నారాయణ, డెరైక్టర్ ప్రొ.రాజశేఖర్, యూజీసీ డీన్ ప్రొ.మల్లేశం అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
పీజీ, రీసెర్చ్ బ్లాక్ నిర్మాణానికి సహకరిస్తాం
ఉస్మానియా న్యాయ కళాశాల ఆవరణలో పీజీ, రీసెర్చ్ బ్లాకు నిర్మాణం కోసం తన వంతు సహకారం అందిస్తానని ఓయూ వీసీ ప్రొ.డి.రవీందర్ అన్నారు. అల్యూమినీ సమా వేశాలు విజయవంతం కావడానికి న్యాయ కళాశాల కూడా తోడ్పాటు అందించిందని అల్యూమినీ న్యాయ కళాశాల, హాస్టల్ అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందిం చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అల్యూ మినీ ప్రముఖులను రిజిస్టర్ లక్ష్మీనారాయణతో కలిసి సన్మా నించారు. ఈ సందర్భంగా రూ.5లక్షల విరాళం ప్రకటించ డంతోపాటు మిగతా అల్యూమినీ సహకారంతో బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు తాను బాధ్యత తీసుకుం టానని ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల అల్యూమినీ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవా ది, మాజీ నేషనల్ బార్ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు ప్రకటించారు. బుధవారం న్యాయ కళాశాల సెమినార్ హాల్లో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెస ర్ డాక్టర్ గాలి.వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన గ్లోబల్ లా అల్యూమినీ మీట్ సమావేశంలో వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల అమ్యూమినీ, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా ప్రొ.వెంకటేశ్వర్లు, లీగల్ సెల్ కన్వీనర్ ప్రొ.విజయలక్ష్మి, సీనియర్ ప్రొ.జిబి రెడ్డి, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక యాదవ్, పీజీ నాయకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనురాధ, న్యాయ విద్యార్థులు, పరిశో ధకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇతర ప్రొఫెసర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.