Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
గోషామహల్ చుడీబజార్లోని రాంమనోహర్ లోహి యా ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయా లని మాదిగ బందు మిత్ర సంఘం ప్రధాన కార్యదర్శి అర్.సుమన్ కుమార్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుడీబజార్, జుమ్మెరాత్ బజార్లో ఎంతో మంది నిరుపేద ప్రజలు జీవిస్తుంటారన్నారు. వారికి ఉపయోగకరంగా ఉన్న ఫంక్షన్ హాల్ లేకపోవడంతో పదేండ్లుగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం అధికారులు నిర్మాణ పనులను అర్థాంతరంగా నిలిపేయడంతో నిర్మించిన పనులు పగుళ్ళు ఏర్పడి చెడిపోవటమే కాకుండా నిర్మాణ వ్యయం కూడా పెరుగే అవకాశం వున్నదన్నారు. 70 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయనీ, మిగిలిన పనులను అధికారులు వెంటనే స్పందించి నిర్మాణం పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు.