Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక విద్యపై నైపుణ్యం పెంపొందించేందుకు ప్రోత్సాహకంగా దూలపల్లి, మైసమ్మగూడ లోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకి భారత జాతీయ సంస్థ, శాస్త్ర సాంకేతిక విభాగం వారు రూ.21 లక్షలు మంజూరు చేసినట్టు నర్సింహారెడ్డి కళాశాల చైర్మన్ జె.నర్సింహారెడ్డి తెలిపారు. తమ కళాశాలలో గ్రామీణ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు విద్యతోb ాటు శాస్త్ర సాంకేతికపై అవగాహన కల్పించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ నిధులను ఉపయోగిస్తామన్నారు, తమ కళాశాలలో ప్రతి ఏడాదీ అధ్యాపకులు విద్యా ప్రాధాన్యతతోపాటు సమాజానికి ఉపయోగపడేలా విజ్ఞాన శాస్త్రం పై మరింతగా అర్థమయ్యే విధంగా కళాశాల ప్రాంగణంలో లఘు చిత్రాల ప్రదర్శన, నిపుణులతో అర్థమయ్యే విధంగా విద్య బోధన, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఇలాంటి ప్రదర్శన వల్ల విజ్ఞానంపై మక్కువ ఏర్పడి సమాజానికి మరింతగా ఉప యోగపడే పరిశోధనలు చేపట్టగలరన్నారు. ఈ నిధులను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శాస్త్ర విజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకే ఉపయోగిస్తామన్నారు. కార్యక్రమం లో కళాశాల కార్యదర్శి జె.త్రిశూల్ రెడ్డి, కళాశాల కోశాధికారి జె.త్రిలోక్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డా.లోకనాథం, ఈసీఈ విభాగాధిపతి డా. తివారి, స్టూడెంట్ అఫైర్స్ డా.వెంకట్రా వు, వివిధ విభాగాధిపతులు, డీన్లు పాల్గొన్నారు.