Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డి శుక్రవారం నగరంలోని ఆసిఫ్‌నగర్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసేవరకు ఉద్యమించాలన్నారు. ఆరేండ్ల పాటు మీ పోరాటాలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్సీని ఎన్నుకునే విషయంలో 30 ఏండ్ల పాటు అనేక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన తన అభ్యర్ధిత్వాన్ని కూడా పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయకుండా జియో అటెండన్స్తో ఉపాధ్యాయులను అవమానపరచడం సరికాదన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శారద, రాష్ట్ర కమిటీ సభ్యుడు సింహాచలం, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్, జిల్లా కార్యదర్శులు ఉదరు కుమార్, రామస్వామి, క్రీడా కమిటీ కన్వీనర్ నాగేంద్ర, సీనియర్ నాయకులు నరేందర్, తదితరులు పాల్గొన్నారు.