Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
డివిజన్లో ఇదివరకే మంజూరైన పనులు, ప్రారంభమైన పనులు, పెండింగ్లో ఉన్న పనులపై వార్డు కార్యాలయంలో అధికారులతో కలిసి నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఇదివరకే మంజూరైన నాలుగు బ్రిడ్జిల నిర్మాణం విషయమై పనులు ప్రారంభం కాలేదని తక్షణమే పనులు ప్రారంభిం చాలన్నారు. ఇదివరకే మంజూరైన అంబేద్కర్ యువజన సంఘం భవనం, హనుమాన్ నగర్ సామాజిక భవనం నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై కార్పొరేటర్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన పనులను తక్షణమే ఆలస్యం చేయకుండా ప్రారంభించాలన్నారు. కొన్ని కొత్త ప్రతిపాదనలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటి వ్ ఇంజినీర్ హరిలాల్, డిప్యూటీ ఇంజినీర్ రూప, అసిస్టెంట్ ఇంజినీర్ లింగారావు, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేకర్ పాల్గొన్నారు.