Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
విద్యార్థులకు విద్యార్థి దశలోనే విలువలతో కూడిన విద్యను అందించి సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సెంట్రల్ యూనివర్శిటీ రీసర్చ్ డెవలప్మెంట్ స్కిల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సామ్రాట్ ఎల్ సబటు ఉపాధ్యాయు లకు సూచించారు. శుక్రవారం హరిహర కళాభవన్‌లో సదాశివ హై స్కూల్ ఫిరోజ్‌గూడ, హై స్కూల్ (యు పోనీ) వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి అథితిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశభక్తి, సంస్కతిని కూడా బోధించాలన్నారు. విద్యా సంస్థల నిర్వహణ అంటే మంచి సమాజం నిర్మించడమే అన్నారు. అదే దిశలో సదాశివ హై స్కూల్ పయణిస్తుందని అభినం దించారు. సమాజంలో డబ్బు అనేది ముఖ్యమైనదే కానీ దానికి బానిసలు కాకూడదని సూచించారు. కరోనా సమయంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మొబైల్ ఫోన్లకు అతుక్కుని పోయారనీ, ప్రతి రోజూ 4 నుంచి 5 గంటలకు దాంతోనే గడుపుతున్నారని తెలిపారు. ఫోన్ ద్వారా సమాచారం, విజ్ఞానం పొందవచ్చనీ, కేవలం వినోదం కోసం అంత సమయం వృధా చేయడం సరికాదన్నారు. సదా శివ హై స్కూల్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్. ఎస్.శివరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు 100శాతం విద్య బోధించడంలో ముందున్నట్టు తెలిపారు. ప్రతిభగల విద్యార్థులను తీర్చిదిద్దడమే సదాశివ స్కూల్ గ్రూపు ఉద్దేశమ న్నారు. స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు కుటుంబం లాగా ఉంటే స్కూల్ కొనసాగుతుందని చెప్పారు. కార్యక్ర మంలో సదాశివ స్కూల్ బ్రాంచ్ డైరెక్టర్ వెంకటరమణ, అకాడమిక్ శర్మ ప్రిన్సిపాల్లు హర్షిత, నీరజ, వాణి, రాజకుమార్, నాగేందర్, సుమ, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కతిక కార్యక్రమాలు..
ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ కట్టిపడేశాయి. భారతీయ సాంప్రదా యాలు, ఉత్సవాల గొప్పదనాన్ని వివరిస్తూ చేసిన నాటికలు అందరిని అలరించాయి. అలాగే వివిధ రకాల ఆటాపాటలు విద్యార్థులను, తల్లిదండ్రల్ని మంత్ర ముగ్ధుల్ని చేశాయి.