Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
చేనేత సారీస్‌లో ఎంతో పేరుగావించిన శ్రీ అవంతి సిల్క్స్ భారతీయ సంప్రదాయంలో ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ చేనేత సారీస్‌ను అందిస్తుందని జాయింట్ కమిషనర్ ఆఫ్ జి.ఎస్. టి. అన్నారు. బషీర్‌బాగ్‌లోని శ్రీ అవంతి సిల్క్స్లో శనివారం సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అవంతి సిల్క్స్ నిర్వహకులు నివేదితా మిశ్రా మాట్లాడుతూ కొంత కాలంగా కస్టమర్స్ ఎంతో మన్నెలను పొందిన శ్రీ అవంతి సిల్క్స్ పదేండ్లుగా సంక్రాంతి సంబురాలు చేసుకుంటున్న ట్టు తెలిపారు. ఇపుడు 7వ సంవత్సరం సంక్రాంతి సంబు రాలు చేసుకుటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నా రు. తమ దగ్గర కంచి బంధేజ్, అజ్రాక్, పోచంపల్లి, గద్వాల్, కంచి వంటి చేనేత ఉత్పత్తులు, నారాయణపేట, మంగళగిరి, కోస్తా సిల్క్ చీరలు, మహేశ్వరి చీరలు, చందేరి చీరలు, ప్రత్యేకంగా తాము హ్యాండ్పెయింటింగ్ కలంకారి కళను అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేసిన ట్టు తెలిపారు. తాము నేడు అన్ని చేనేత ఉత్పత్తులపై 50శాతం ఫ్లాట్ తగ్గింపును అందిస్తున్నట్టు తెలిపారు. మరిన్ని సారీస్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీష్‌గఢ్, మరిన్ని రాష్ట్రాల్లో చేనేత వస్త్రాలను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ శాంత కుమారి, డాక్టర్ ఏ కె రోహిణి, హెరిటేజ్ హెల్త్ ఇన్సూరెన్స్, శ్రీఅవంతి సిల్క్స్ నిర్వహకులు నివేదితా మిశ్రా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.