Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
తడి, పొడి చెత్తను వేరు చేసి వేయాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ అన్నారు. చెత్త మీద అవగాహన కార్యక్ర మంలో భాగంగా గాయత్రి నగర్, తులసి నగర్లో హెల్త్ ఆఫీసర్ వెంకట రమణ, సర్కిల్ ఇన్చార్జి హరికృష్ణ, ఎస్ఆర్పి సురేష్, ఎస్.ఎఫ్.ఏఅరుణ్, ఎస్.ఎఫ్.ఎస్ సురేష్, డబ్ల్యూఎఫ్ఎ శాంతి, రాంకీ సిబ్బంది, శానిటేషన్ అధికారులతో కలిసి చెత్తపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చెత్త చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడవేయ కుండా చెత్త రిక్షాల్లోనే వేయాలని సూచించారు. చెత్త ఎక్కడపడితే అక్కడ పేరుకుపోవటం వల్ల చుట్టూ ఉండే ప్రజలకు తెలియని వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని, సొంత బిల్డింగ్ ఓనర్స్‌కి రోజు చెత్తను ఒక దగ్గర పెట్టి ఇంటి ముందుకు వచ్చిన మున్సిపాలిటీ ఆటోలోనే వేయాలని సూచించారు. తడి పొడి చెత్త వేరు వేరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి నగర్ ప్రెసిడెంట్ సంజరు రెడ్డి, తులసి నగర్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, బీవీర్ నాయుడు, జ్ఞానేశ్వర్, నిస్సాల్, వెంకటరమణ, హేమాచల్ రావు, విట్టలయ్య, రవీందర్ రెడ్డి, జితేంద్ర, యోగి రాజు, లక్ష్మి, సత్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.