Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
తెలంగాణ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే పదవ సబ్ జూనియర్ అంతర్ జిల్లా ఫిస్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు శని వారం ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర వేదాం త వర్డిని సంస్కత పాఠశాల మైదానంలో ప్రారంభమ య్యాయి. ముఖ్య అతిధిగా హాజరైన డీఎస్పీ ప్రగతి భవన్ కృష్ణ, ఫిస్ట్ బాల్ అసోసియేషన్ ఛైర్మెన్ జంపన ప్రతాప్ ఇతర అథితులకు స్వాగతం పలికారు. పోటీల ప్రారంభో త్సవ కార్యక్రమం ముందు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేయగా అథితులు వారి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు లాక్స్విల్ స్టూడియో హైదరాబాద్ తెలంగాణ ఫిస్ట్‌బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్, హెచ్ఆర్ గ్రూపులు ఎంఎస్‌బీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎం.వంశీ రావు, తెలంగాణ ఫిస్ట్‌బాల్ అసోసియేషన్ సలహాదారు పెస్ట్ కంట్రోల్ డైరెక్టర్ విక్రమ్ సిన్హా, ఎస్వీవీవీ కళాశాల టీటీడీ ప్రిన్సిపాల్ డాక్టర్ బానోత్ సురేందర్, ఎస్వీవివిఎస్ హెడ్ మాస్టర్ గెడం కిషన్, హౌప్ విజరు, తెలంగాణ ఫిస్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ కొము హాజరయ్యారు. మొదటిరోజు పోటీల్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, నల్గొండ, వికారాబాద్, ఖమ్మం బాలికల జట్టు, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, మెహబూబాబా ద్, నల్గొండ, సంగారెడ్డి, వికారాబాద్, యదాద్రి, సిద్దిపేట బాలుర జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్‌లో యాదాద్రి బాలుర జట్టుపై హైదరాబాద్ బాలుర జట్టు 6-11, 11-6,11-8 స్కోర్‌తో విజయం సాధించింది. బాలికల విభాగంలో కరీంనగర్ జట్టు పై రంగారెడ్డి జట్టు 11-6, 11-5 స్కోర్ తో గెలిచింది.