Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెల్టు షాప్‌లు, గంజాయిని అరికట్టడంలో అధికారులు విఫలం
- 'కంటి వెలుగు'పై ప్రజాప్రతినిధులకు సమాచారం లేదు
- జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో వాడీ వేడి చర్చ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
స్థానిక సంస్థ నిధులను విడుదల చేయకుండా ప్రభు త్వం దారి మళ్లించడంపై జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అధికారులపై మండి పడ్డారు. శనివారం మేడ్చల్‌లోని జిల్లా పరిషత్ కార్యాల యంలో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమేవేశం జిల్లా పరిష త్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వ హించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికా రులకు వాగ్వివాదం జరిగింది. గ్రామాల్లో వైన్స్ షాప్‌లు, బార్లు ఉండగా, విచ్చల విడిగా బెల్ట్ షాప్‌లు, గంజాయి విక్రయిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకో వడం లేదని మండిపడ్డారు. కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజాప్రతినిధులకు అధికారులు ఎందుకు సమాచా రం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంద నీ, ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండ టం వల్లే రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొం టున్నారనీ, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ ఇతర రాష్ట్రాల్లో సైతం అలాంటి పథకాలను ప్రవేశపెడు తున్నట్టు తెలిపారు. తెలంగాణ దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా సైతం అధికారుల కృషి, ప్రజాప్రతి నిధుల సమన్వయంతో అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ఇదే తరహాలో అధికారులు, ప్రజాప్రతినిధు లు సమన్వయంతో పని చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం, మంచినీటి సరఫరా, జిల్లాలోని గ్రామపంచాయ తీలన్నింటికీ ట్రాక్టర్లు, ట్రాలీలు, వాటర్ ట్యాంకర్లను అందించిందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడా లేని విధంగా నిమిషం కూడా విద్యత్ సరఫరాకు అంతరా యం కలగకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తోందన్నారు. అన్నదాతకు అండగా ఉంటూ రైతులకు పంట పెట్టుబడి కోసం రైతుబంధుతోపాటు ఏదైనా ప్రమాదం, ఇతర కారణాలతో రైతులు మృతి చెందితే వారికి రైతుబీమాతో రూ.5 లక్షలు అందచేస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తోన్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ప్రజల ఓసమే పని చేస్తోందనీ, వారి సంక్షేమానికి, అభివృద్ధికి అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందన్నా రు. వీటిని అర్హులైన ప్రజలు వినియోగించుకుని ఆర్థికాభి వృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. గతంలో గ్రామపంచాయ తీల కన్నా ప్రస్తుత గ్రామపంచాయతీల్లో వంద శాతం అభివృద్ధి జరిగిందనీ, ఎన్నో మార్పులు జరిగి అభివృద్ధి చెందాయని తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో కూడా పట్టణాలకు ధీటుగా అన్ని రకాల వసతులు ఉన్నాయన్నా రు. జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నా రనీ, అందుకు నిదర్శనమే జిల్లా అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండటం అని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ, వైద్య, ఆరోగ్య శాఖ, ఆబ్కారీ (ఎక్సైజ్) శాఖ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, మైనింగ్, ఆర్ అండ్ బీ, జిల్లా పంచాయతీ శాఖలు చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ అంశాలపై సంబంధి త అధికారులను మంత్రి మల్లారెడ్డి, జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సమాధానాలిచ్చి అందు కు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేశారు. జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా అన్ని రంగాల్లో ముం దు స్థానంలో నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విషయంలో జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొంద రు సభ్యులు అడిగిన వివరాలు, సమాచారాన్ని, సందే హాలను కలెక్టర్ హరీశ్ వారికి తెలియజేసి నివృత్తి చేశారు. ఈ విషయంలో జిల్లా పరిషత్ సీఈవో ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా అందరి సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందు కు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామనీ, మున్ముందు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేశ్, జడ్పీ సీఈ వో దేవసహాయం, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్ర తినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.