Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
డౌన్ బడ్స్ మోడల్ స్కూల్లో శనివారం గణితశాస్త్రజ్ఞుడు రామనుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాధానోపాధ్యాయులు నాగరాజు అధ్యక్షత వహించారు. ప్రాథమిక, ఉన్నత వివిధ రకాల గణిత తరగతి చదువు తున్న బాలబాలికలు నమూనాలను ప్రదర్శిస్తూ రామా నుడు గణిత రంగానికి చేసిన సేవలను వివరించారు. గణితం వల్ల మనకు నిత్యజీవితంలో కలిగే ప్రయోజనా లు, గణిత విలువలు ఎంతో చక్కగా వివరించారు. తొమ్మిదవ తరగతి బాల బాలికలు, డ్రామా, ఆట, పాటల ద్వారా పిల్లలకు గణితం పట్ల ఆసక్తి కలిగించారు. పిల్లల తల్లిదండ్రులు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించి, పిల్లలకు గణితం పట్ల జిజ్ఞాసను కలిగించం చాలా బాగుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో తిరుపతి రెడ్డి, రాజేందర్, ప్రదీపి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.