Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 103 పార్కుల్లో ఏర్పాటు
- దేశంలో ఏ మెట్రో నగరంలో లేని క్రీడా మైదానాలు హైదరాబాద్‌కే సొంతం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగర ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు జీహెచ్ఎంసీ అధిక ప్రాధాన్యతనిస్తున్న విషయం తెలిసిందే. ప్రజల మౌలిక సదుపాయాలు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు నగరవాసుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాతావరణ సమతుల్యత పెంపొందించడం కోసం చర్యలు చేపట్టింది. దానితో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉం డేందుకు వ్యాయామం కోసం వసతులను ఏర్పాటుకు ప్రాధా న్యత ఇస్తుంది. అందులో భాగంగానే నగరవాసుల ఆరోగ్య పరిస్థి తి మెరుగు పరచడం కోసం శారీరక శ్రమ పెంపొందించేందుకు ఓపెన్ జిమ్‌లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. ఈ ఓపెన్ జిమ్‌లతో సహజ వాతావరణంలో వ్యాయామం చేయడం మూలంగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యరశ్మితో విటమిన్ డి పొందడం మూలంగా మానసిక స్థితిని ప్రభావితం చేసే సెరోటోనిస్ హార్మోన్‌ను పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండోర్ కంటే అవుట్‌డోర్‌లో చేసే వ్యాయామం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
45వేల మందికి ప్రయోజనం
దేశంలో ఏ మెట్రోపాలిటీ నగరంలో లేనివిధంగా ప్లే గ్రౌండ్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. వీటి ద్వారా 45 వేల మంది ప్రయోజనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా మైదానాల ద్వారా వ్యాయామంతోపాటు సాంప్రదాయక, ఆధునిక క్రీడలను ప్రోత్సహించేందుకు విశేష కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరవాసుల కోసం 146 ఓపెన్ జిమ్‌లను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అందులో 137 అందుబాటులోకిరాగా మారో 9 వివిధ అభివృద్ధి దశలో కలవు. దీంతోపాటు ప్రజల సౌకర్యార్థం కోసం 103 పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ జోన్లో 23 ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. చార్మినార్ జోన్లో 18, ఖైరతాబాద్ జోన్లో 30 జిమ్‌లు అందుబాటులోకొచ్చాయి. శేరిలింగంపల్లిలో 24 ఓపెన్ జిమ్లకుగాను 23 పూర్తయ్యాయి. కూకట్పల్లి జోన్లో 37 ఓపెన్ జిమ్‌ల పనులు చేపట్టగా 35 పూర్తయ్యాయి. సికింద్రా బాద్ జోన్లో 14లో 5 ఓపెన్ జిమ్‌లు వివిధ దశల్లో ఉన్నాయి.