Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య,
- ప్రజావాణిలో 92 విజ్ఞప్తులు స్వీకరణ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్ర మానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న ఆర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలని అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 92 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్యలు జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌కు అందజేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఏమాత్రం పెండింగ్‌లో ఉంచకుండా వీలైతే అప్పటికప్పుడే పరిష్కరించాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను తీర్చాలని అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిల్ సమావేశాలకు అనుమతించాలని టీయూడబ్ల్యూజేఐజేయు ఆధ్వర్యంలో వినతి
మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల సమగ్ర సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుం టానని, మున్సిపల్ కమిషనర్లకు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాల రాజు మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సి పాల్టీల సర్వసభ్య సమావేశాలకు మీడియాను అనుమతించడం లేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కౌన్సిల్ సమావేశాల సంద ర్భంగా మీడియాకు కనీసం ఎజెండా కాపీలను కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.జర్నలిస్టులకు ఖచ్చితంగా పూర్తి సమాచ ారం తెలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందిం చిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కచ్ఛితంగా సమాచారం ఇచ్చే లా చర్యలు తీసుకుంటానన్నారు. ముందస్తుగా ఎజెండా కాపీలు అందించడంతోపాటు కౌన్సిల్ సమావేశంలో జరిగిన చర్చలను రికార్డు రూపంలో కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్యూజే - ఐజేయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి డి.వెంకట్ రాంరెడ్డి, జిల్లా స్టాఫర్లు కృష్ణ, శ్రీరాములు, జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శులు రచ్చ శ్రీని వాస్, రవీందర్, బాల్ రెడ్డి, నాగరాజు, సహాయ కార్యదర్శి డి.రాజి రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.