Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక వృత్తిదారుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో కార్మికశాఖ మంత్రి మాల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మికశాఖ మంత్రి మాల్లారెడ్డి అన్నారు. సోమవారం తెలం గాణ రజక వృత్తిదారుల సంఘం 2023 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజక వృత్తిదా రుల సమస్యలపైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ 13 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజకుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. మీ సమస్యలన్నీ పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. రజక వృత్తిదారులకు మోడ్రన్ ధోబీఘాట్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రుణాలు అందించే విధంగా తన వంతు కృషి చేస్తాన న్నారు. బీఆర్ఎస్ మేడ్చల్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్ చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేద రజక వృత్తిదా రులను ఆర్థికంగా ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తానాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ సుభద్ర, జ్యోతి ఉపేందర్, గ్రేటర్ హైదరాబాద్ రజక వృత్తిదారుల నాయకులు ఎల్ సురేష్, అస్మాన్ పేట ధోబిఘాట్ అధ్యక్షుడు బాలయ్య, కొండల్, జిల్లా కోశాధికారి సట్టు రవి, మామిడాల ఉమా, లావణ్య, సీహెచ్ విజయ లక్ష్మి, లింగం పాల్గొన్నారు.