Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మారేడ్‌పల్లి మండలంలోని అడ్డగుట్ట సర్వే నెం.74లో ప్రభుత్వ భూముల్లో ఎలాంటి బై నెంబర్లు లేని సర్వే నెంబర్‌కు 74/10వేసి మారేడ్‌పల్లి మండల ఆఫీసు పక్కనే ఉన్న సుమారు 9.24ఎకరాల భూమిని యథేచ్చగా చదునుచేసి రేకులు అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వీటిని వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోరుకుమార్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎం.శ్రీనివాస్ మాట్లా డుతూ 2009కి ముందు ఈ భూమిలో 50పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే, ఎంపీలు బడ్జెట్ కేటాయించి శంకుస్థాపనలు చేసినా ఈ స్థలం తమదే అంటు న్నారన్నారు. ఈ భూకబ్జాలను వెంటనే ఆపాలని, కబ్జాలకు పాల్పడుతున్న వరప్ర సాద్, రాజు, జగన్మోహన్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ భూము లను ప్రజాప్రయోజనాలకు, పేదల ఇండ్ల స్థలాల కోసం ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ కన్వీనర్ ఎం.అజయ్‌బాబు, నాయకులు ఆర్.మల్లేష్, ఆర్.వీరలక్ష్మి, ఎం.గోపాల్ పాల్గొన్నారు.