Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్
నవతెలంగాణ-మీర్పేట్
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36వ డివిజన్ పరిధిలోని చాలా కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పైపులైన్ నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు.