Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ కమిషనర్లు కృష్ణయ్య, మారుతీ దివాకర్
నవతెలంగాణ-ఎల్బీనగర్
పిల్లల పోషణ మన అందరి బాధ్యత అని సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో కార్పొరేటర్స్, అధికారులతో పోషణ అభియాన్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బేటీ బచావో, బేటీ పడావో, పిల్లల పోషణ అందరి బాధ్యత అన్నారు. పిల్లలను పాఠశాలకు పంపుతూ మంచి ఆహారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్దిదారులు పొందాలని సూచించారు. సమావేశంలో కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ కుమార్ రెడ్డి, రాధ ధీరజ్ రెడ్డి. ఎమ్మార్వో, ఎంఈఓ, మెడికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సూపర్వైజర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఆడపిల్లలను చదివిద్దాం
ఆడపిల్లలను పుట్టనిద్దాం, చదవనిద్దామని హయత్‌నగర్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ అన్నారు. సోమవారం హయత్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో పోషణ అభియాన్ సమావేశం జరిగింది. పిల్లలకు సంబంధించిన పోషణ, సంరక్షణ అంశాలపై చర్చించారు. పిల్లలను పాఠశాలకు పంపుతూ మంచి ఆహారాన్ని అందించాలని కోరారు. ఆడ పిల్లలపైనే సమాజం ఆధారపడి ఉందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, అరుణ సురేందర్, నవజీవన్‌రెడ్డి, ఎంఈఓ, మెడికల్ ఆఫీసర్, సీడీపీ, హయత్ నగర్ ప్రాజెక్ట్ సూపర్వైజర్లు, అధికారులు పాల్గొన్నారు.