Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ హక్కుల సాధన సమితి
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్పీ రంగాచారి
నవతెలంగాణ-సరూర్నగర్
చేనేతలందరూ రాజకీయ నేతలు కావాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయ బండి పాండు రంగాచారి పిలుపునిచ్చారు. సోమవారం సరూర్నగర్ డివిజన్ ఏఎస్ఆర్ గార్డెన్లో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలీ సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. సంఘం అధ్యక్షులు కుంట్ల ఆంజనేయులు నేత ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్పీ రంగాచారి హాజరై మాట్లాడారు. దేశంలో బడుగు, బలహీన వర్గాల అంతా సామాజిక, ఆర్థిక, రాజకీయ, అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేనేతలకు బడ్జెట్లో నిధులు అరకొరగా కేటాయించి ఖర్చు పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్యం ఉందన్నారు. చేనేతలకు అధిక నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షులు బొమ్మ రఘురాం, రావిరాల సంధ్యారాణి, చక్రవర్తి, గోషిక నరసింహ, మిర్యాల సుదర్శన్, నామా లక్ష్మణ్ నేత, ఎల్లయ్య, జక్క నాగయ్య పాల్గొన్నారు.