Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
నవతెలంగాణ-సంతోష్‌నగర్
మలక్‌పేట నియోజకవర్గంలోని వివిధ డివిజన్ పరిధిలో నెలకొన్న డ్రయినేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరిగిన జనాభాకు అనుగుణంగా డ్రయినేజీ వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. వివిధ డివిజన్లలో నెలకొన్న సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. అజాంపురా, సైదాబాద్ చార్మినార్, చాదర్‌ఘాట్, ఓల్డ్ మలక్ పేట డివిజన్లో పలు అభివృద్ధి పనులు సాగుతున్నాయని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పలు డివిజన్ ప్రాంతాల్లో డ్రయినేజీ, సీసీ రోడ్లు మరమ్మతులు, ఏపుగా చెట్ల కొమ్మలు, విద్యుత్ వైర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు మంచి సర్వీస్ ఇస్తే వాళ్లు మన వెంటనే ఉంటారని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు కార్పొరేటర్లు, సిబ్బంది, అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.