Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్
నవతెలంగాణ-సరూర్నగర్
సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గాలివాటంగా గెలిచిందని, ఆమెకు ప్రచార ఆర్భాటం తప్ప డివిజన్ని అభివృద్ధి చేయాలని లేదని ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ అన్నారు. సోమవారం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్లో ఇటీవల ఆకుల శ్రీవాణి మహేశ్వరంలో పంచిపెట్టిన ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పిస్తామని హెచ్చరించారు. అభివృద్ధిపై ఏనాడూ కూడా మంత్రి దృష్టికి తీసుకుపోకపోగా రాజకీయ లబ్ది కోసమే ప్రతిరోజు వీడియోలను రిలీజ్ చేస్తున్నారన్నారు. మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు గొడుగు శ్రీనివాస్, నేలకొండ శ్రీనివాస్ రెడ్డి, సాజిద్, కొండ్ర శ్రీనివాస్, జగిని రమేష్ గుప్తా, వెంకటేశ్ గౌడ్, కంచెర్ల శేఖర్, జగన్, దుబ్బాక శేఖర్, శంకర్ నాయక్, మహిళా అధ్యక్షులు ఊర్మిల రెడ్డి, మారం సుజాత రెడ్డి, మాధవి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.