Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
రజక సంఘం కమిటీ హాల్‌కు నిప్పంటించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని హయత్ నగర్ తహసీల్దార్‌కు శుక్రవారం రజక సంఘం నేతలు ఫిర్యాదు చేసారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని బాగ్ హయత్ నగర్లో ఉన్న ఈదమ్మ రజక సంఘానికి గతంలో రెవిన్యూ అధికారులు 1-20 ఎకరాలు కేటాయించగా కబ్జాకు గురై నేడు సర్వే నెంబర్ 207/1 లో 34 గుంటాలు ఉండగా దానిని కూడా కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నించగా రజకులు అడ్డుకున్నారని తెలిపారు. ఈ విషయంపై ఈదమ్మ రజక సంఘం అధ్యక్షులు స్వామి అధ్వర్యంలో హయత్ నగర్ ఎమ్మార్వోని కలిసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు మాట్లాడుతూ రజక వృత్తిదారులకు న్యాయం చేయాలని కోరారు. వీర వనిత చిట్యాల ఐలమ్మ చిత్రపటంతోపాట బట్టలు కాలిపోయాయని, ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను పట్టుకొక పోగా, తహసీల్దార్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని, సమాధానాలు అనేక సందేహాలు కల్గిస్తున్నాయని మండిపడ్డారు. రజకులకు న్యాయం చేయకపోతే, న్యాయం కోసం, రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మల్లేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి.ఉమేష్, సోషల్ మీడియా కన్వీనర్ రేవల్లి నరేష్, సౌత్ జోన్ జిల్లా అధ్యక్షులు రాములు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ, తెలంగాణ ఈదమ్మ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.