Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
నూతన సంవత్సరం సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు బొకెలకు బదులుగా నోటు పుస్తకాలు తేవాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించించింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనకు నేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పిన వారు సుమారు 6 వేల నోట్ పుస్తకాలు అందించగా, అంతకు రెండింతలు మరికొందరు తమ గ్రామాల్లో విద్యార్థులకు అందజేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేశరని తెలిపారు. మంత్రి పిలుపుతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని నాయకులు తమ తమ గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, నోట్ పుస్తకాలు, డిక్షనిరీలు, మ్యాట్లు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు పాఠశాలల విద్యార్థులకు అందించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి పరిగి నియోజకవర్గములోని పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందజేయటానికి ముందుకు రావటం హర్షణీమన్నారు. చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మునిసిపాలిటీకి చెందిన 5వ తరగతి విద్యార్థి ఎండి అసద్ తాను దాచుకున్న కిడ్డి బ్యాంకులోని డబ్బులతో నోట్ పుస్తకాలు కొని మంత్రికి అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అందరికి ఆదర్శంగా నిలిచాడు. అదే విధంగా రెండు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వధా ఖర్చుల స్థానంలో ఉపయోగపడే స్టేషనరీ లభించింది. ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా తనతో పాటు ఎవరిని కలిసిన ఇదే విధానం కొనసాగించాలని మంత్రి కోరారు. తన పిలుపుకు స్పందించి ముందుకు వచ్చిన అందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లోని పాఠశాలలను దత్తత తీసుకోవాలని, అంగన్వాడీ విద్యార్థులకు మ్యాట్లు, వాటర్ బాటిళ్లు, బ్యాగులు, బుక్కులు అందించి అండగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు.