Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కుటుంబ సభ్యుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్రగుడలోని సంజీవిని పార్కులో జాతీయ నాయకులు టి. ఆచారి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు చిట్టనోజు ఉపేంద్రాచారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆదిమూలం వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి బొల్లోజు శ్రీనివాస్ చారి, కోశాధికారి చిన్నోజి యాదాచారి, ప్రచార కార్యదర్శి పోలోజు జంగయ్య చారితో పాటు కొంత మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. అనంతరం 2023వ సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ మనుమాయ సంఘం వారంతా విద్యతో పాటు ఆర్థిక, రాజకీయ రంగంలో రాణించాలన్నారు. కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి, కుందారం గణేష్ చారి, ఎర్రవెళ్లి బాలచారి, రాళ్లబండి విష్ణుచారి, తాటికొండ శ్రీరాములుచారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ నాయకులు నారాజు జగ్జీవనాచారి, నాగోజు రామాచారి, పర్వతం శ్రీనివాస్ చారి, మాధవాచారి చంద్రశేఖర్ చారి, వెంకటాచారి, రాపల్లి కృష్ణమాచారి, కలకొండ శ్రీనివాస్ చారి, మురళి చారి, పబ్బోజు బిక్షపతి చారి, జంగా చారి, శివ కుమార్ చారి, బ్రహ్మచారి, శ్రీధర్ చారి తదితరులు పాల్గొన్నారు.