Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పుల పంపిణీ
- జాతీయ అధ్యక్షుడు కె.పాపారావుతో పాటు ప్రముఖుల హాజరు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వివిధ దేశాల్లో పద్మనాయకులతో పాటు ఇతర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఓవర్సీస్ వెలమ అసోసియేషన్(ఓవీఏ) తమ సేవలందిస్తోంది. విదేశాల్లో ఉంటున్న వెలమ కులస్థులంతా సంఘటితమై స్వదేశంలో తమ కమ్యూనిటీతో పాటు సొంత ప్రాంతం అభివృద్ది కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా గురువారం కొంపల్లిలోని ఎస్పీజీ కన్వెన్షన్‌లో దాదాపు 15దేశాల నుంచి ఎన్ఆర్ఐ వెలమ ప్రతినిధులు సమావేశమై.. 29మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నత చదువుల కోసం స్కాలర్‌షిప్పులను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఓవర్సీస్ వెలమ అసోసియేషన్, అఖిల భారత వెలమ అసోసియేషన్ ప్రెసిడెంట్ క్రిష్ణమనేని పాపారావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా జయశంకర్ అగ్రి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రవీణ్ రావ్, టీఎస్పీఎస్సీ సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావ్, చల్మెడ లక్ష్మీ నరసింహారావు అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయినా తమ సందేశాన్ని పంపించారు. ఐవా, ఓవర్సీస్ వెలమ అసోసియేషన్ సంయుక్తంగా అందజేసిన ఈ స్కాలర్షిప్పులు విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉండడంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపుతాయని, ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన వారిని అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని, దానికి ప్రతీఒక్కరి సహాయ సహకారాలుంటాయన్నారు. ఈ సందర్భంగా ఎం. వెంకటరమణ రావుని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది ఐవా సభ్యులు, ఓవర్సీస్ వెలమ అసోసియేషన్ ఫౌండర్ జగ్గన్నగారి నర్సింగరావు(ఆస్ట్రేలియా), మారునేని శ్రీచరణ్ రావ్, రమేష్‌లు(అమెరికా), కళ్యాణ్ రావ్(న్యూజిలాండ్), మాధవ్, రోహిత్ రావ్(ఆస్ట్రేలియా) రవీందర్ రావ్, శ్రీనివాస్ రావ్, ఐవా ప్రధాన కార్యదర్శి పుస్కూర్ శ్రీకాంత్ రావ్, ఓవర్సీస్ వెలమ అడ్వైజర్స్ అరశనపల్లి రాజేష్, ఫైనాన్స్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ టోని, కో ఆర్డినేటర్లు బల్మూరి సుమన్ రావ్(యూకే), ప్రసాద్ రావ్, రామారావ్, ఎం.సత్యనారాయణ రావ్, స్రుజన్ రావ్(సౌత్ ఆఫ్రికా) విష్ణు(ఆస్ట్రేలియా) పాల్గొనగా.. వీరితో పాటు ఇతర దేశాల నుంచి కోఆర్డినేటర్లు, ప్రతినిధులు తమ సందేశాలు పంపారు.