Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హైదర్‌గూడలోని కేఫ్ బహార్ రెస్టారెంట్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన మంటలను అగ్నిమాపక అధికా రులు సకాలంలో స్పందించి ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..కేఫ్ బహార్ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు సమాచారం. యజమాన్యం ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ నిబంధ నలను అతిక్రమిస్తూ బిర్యానీ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు. గ్యాస్ స్టవ్‌లో కలిగిన అసౌకర్యం వల్ల మంటలు ఎగసిపడి ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదాన్ని అగ్నిమాపక సిబ్బంది, కేఫ్ బహార్ యజమాన్యం కలసి తోడై ప్రమాదాన్ని చిన్నదిగా చూపిస్తున్నారు. మీడియా ప్రతినిధులు వివరాలు తెలుసుకునేందుకు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న క్రమంలో దౌర్జన్యంగా వ్యవహరిస్తూ నోటికి వచ్చినట్లు తిట్టారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. రెస్టారెంట్లో పరిశుభ్రత లేదనీ, ఫుడ్‌లో నాణ్యతా ప్రమా ణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని కస్టమర్స్ ఆరో పించారు. మాంసం కడిగిన వాటర్‌ను నిర్లక్ష్యంగా రోడ్డుపై వదులుతున్న జీహెచ్ఎంసీ అధికారులు చూసి చూడన ట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కేఫ్ బహార్ రెస్టారెంట్ యజమాన్యం అధికారులందరికీ నెలవారి మామూళ్లు అందజేస్తూ నిబంధనలు నిసిగ్గుగా అతిక్రమిస్తున్నట్లు అక్కడి వారు, యువకులు ఆరోపించారు. ఇప్పటికైనా ఎలక్ట్రిసిటీ, ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి, యజమాన్యంపై కఠిన చర్యలుతీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.