Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రసంగించిన ప్రొ.హరగోపాల్
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో గురువారం ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ''భావ ప్రకటన స్వేచ్ఛ-మూక స్వామ్యం సమకాలీన పరిస్థితులు'' అనే అంశంపై జరిగిన చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొ.హర గోపాల్ ప్రొ. పద్మజ షా, విజ్ఞాన దర్శిని రమేష్, ఓయూ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పాల్గొని ప్రసంగించా రు. ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ మన దేశంలో పుట్టిన మనువాద బావజాలమే ప్రపంచ నియంతలను ఆకర్షించి, మళ్ళీ అక్కడి నుంచి ఇండియాకి ఆర్ఎస్ఎస్ రూపంలో వచ్చిందన్నారు. రాజ్యం పెట్టుబడిదారీ విధానంతో కలిసి ఇవ్వాళ మళ్ళీ ఆ మనువాద సమాజ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తుందనీ, అందులో భాగం గానే దేశంలోని లౌకిక విలువలపైన, లౌకిక వ్యక్తిత్వాలపైన దాడి చేస్తున్నారనీ, విద్యా వ్యవస్థలో కూడా ఆదిపత్య భావాలు ఉన్న పాఠ్యాంశాలను ప్రవేశపెట్టి రేపటి తరంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నా రనీ, మనం అందరం ఐక్యంగా ఉద్యమాలు చేసినపుడే దాన్ని ఎదుర్కోగలం అన్నారు. ప్రొ.పద్మజ షా మాట్లా డుతూ విభజన రాజకీయాలతో అధికారాన్ని కాపాడు కోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయనీ, మీడియా పక్షపాతం కూడా దీనికి సహకరిస్తుంది అనీ, ప్రజాస్వామ్య, లౌకిక గొంతులను అణచి వేయాలని చూస్తున్నయని తెలిపారు. విజ్ఞాన దర్శిని రమేష్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణలో మూక సంస్కతి పెరిగిపోతుందనీ, అందులో భాగంగానే టీచర్ మల్లికార్జున్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. శాస్త్రీయతను, చర్చ ను భరించలేకనే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనెల్లి, పీడీఎస్‌యూ, ( విజంభణ) ఓయూ కన్వీనర్ అఖిల్, ఎఎస్ ఎ ఓయూ అధ్యక్షుడు దివాకర్, ఉదరు కుమార్, లెనిన్, సునీల్, రాజేష్, రాజు, మధు, కరణ్, వినోద్, ఆంజేయులు, సందీప్, హరీష్, మధు, మనోజ్ పాల్గొన్నారు.