Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆలేటి ఎల్లయ్య
నవతెలంగాణ-వనస్థలిపురం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన జీహెచ్ఎంసీ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆలేటి ఎల్లయ్య అన్నారు. జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ ఎదుట చేపట్టనున్న ధర్నాను ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న కార్మికులందరూ ఐక్యంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం వనస్థలిపురం లేబర్ అడ్డా దగ్గర మున్సిపల్ కార్మికులతో సమావేశమయ్యారు. కార్మికులు నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల బారిన కార్మికులకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కల్పించాలని, వారి వైద్యానికి అయ్యే ఖర్చును జీహెచ్ఎంసీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈమధ్యకాలంలోనే చాలామంది కార్మికుల కాళ్లు, చేతులు, విరిగి యాక్సిడెంట్లో మరణించిన ఉన్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతీ కార్మికుడికి రూ.50లక్షల ఇన్సూరెన్స్ చెల్లించాలని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు, ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాంకీ తదితర ప్రయివేటు ఇంజినీరింగ్ కంపెనీలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు పరమేష్, అచ్చమ్మ, సుశీల, జయమ్మ, పెంటమ్మ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.