Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఐఐసీటీ కాలనీవాసుల ఆందోళన
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ ఐఐసీటీ కాలనీలో పార్కు స్థలాన్ని కాపాడలంటూ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాలనీ వాసులు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ మహిపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేసి కాలనీ పార్కు పరిరక్షణకు సహకరించాలని కోరారు. సర్వే నంబర్ 1 ఏఏ లలో గల 200 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ఆక్రమార్కులు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజల ప్రయోజనార్థం ఆపార్కు స్థలాన్ని తక్షణమే కాపాడాలని కోరారు. స్థానిక నాయకులు బోడిగే రాందాస్ 1979లో 301 ప్లాంట్లుగా లే అవుట్ చేసి విక్రయించారని, దీనిలో ఫ్లాట్ నంబర్ 23లో 200 గజాలు స్థలం 2000లో కాలనీ అవసరాల రీత్యా కాలనీ పేరుతో నిబందనల ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగిందని వెల్లడించారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టక పోవడంతో స్థానిక నాయకులు చదును చేసి కబ్జాకు ప్రయత్నించారని చెప్పారు. ఇది గమనించిన కాలనీ వాసులు ఇంటికి రూ. 2 వేల చొప్పున విరాళలు సేకరించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే రాత్రికి రాత్రే కొందరు నాయకుల ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు అసైన్డ్ స్థలమని నిర్ధాక్ష్యణంగా ఆ ప్రహరీని ధ్వంసం చేశారు.. చేసిదిమిలేక కాలనీవాసులు గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి కబ్జాదారుల చెర నుంచి కాలనీ పార్కు స్థలాన్ని కాపాడాలని విన్నవించారు.