Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే రోజుల్లో దొరల పాలనకు చరమగీతం పాడతారు
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-అడిక్మెట్
బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందనీ, రాబోయే రోజుల్లో దొరల పాల నకు చరమగీతం పాడతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిం చారు. శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించకపోతే, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించకపోతే, గురుకులాల్లో ప్రతి విద్యార్థికీ రూ.లక్షా 25వేలు ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారనీ, రూ.లక్షా 25వేలు ఇవ్వకపోతే రాష్ట్రంలో కేసీఆర్ కో హటావో బీసీలకు బచావో అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి దొరల ప్రభుత్వం బీసీల పట్ల అనుసరిస్తున్న గడీల పాలనను ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రం లో అర శాతం అధికారంలో ఉన్న వారిని 60శాతం ఉన్న బీసీలు మిమ్మల్ని అడుక్కోవాలా అనీ, బీసీలు ఏమైనా బిచ్చగాళ్లు అనుకుంటున్నారా అనీ, బీసీలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్దంగా ఉన్నార న్నారు. మీ వైఖరిని వెంటనే మార్చుకుని 12లక్షల మంది పేద విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చి సాఫిగా కొనసాగాలంటే పెండింగ్లో ఉన్న రూ.3250 కోట్ల ఫీజుల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కట్టాల్సింది సచివాలయం, కలెక ్టరేట్ల భవనాలు కాదనీ, సంక్షేమ భవనాలు నిర్మించాల న్నారు. బీసీల వ్యతిరేక చర్యలు. మానుకోకపోతే ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న దొరల పాలన చివరిది కాబోదుతుందని హెచ్చరించారు. కార్యక్రమం లో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు బైరి రామకృష్ణ, బడేసాబ్, శ్రీనివాస్ గౌడ్, సింగం నాగేష్, ఇంద్రమ్, బత్తిని రాజు, మల్లికార్జున్, విజరు, నాగరాజు, గౌతమ్, సాయి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.