Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
శాశ్వత డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. శుక్రవారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని నూతన డ్రయినేజీ పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాగ్ అంబర్ పేట డివిజన్లోని జామ్జా మసీదు, భరత్ నగర్ లోని గజానంద్ గడ్డ వరకు రూ.48 లక్షలతో నూతన డ్రయినేజీ పనులను ప్రారంభించామనీ, త్వరలోనే బస్తీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల ను సమస్యలను అడిగి తెలుసు కుని.. కాలనీలో ఎత్తుగా పెరిగిన చెట్లను తొలగించాలనీ, కొన్ని చోట్ల వీధి దీపాలను ఏర్పాటు చేయాలనీ, విద్యుత్ స్తంభాలను సరి చేయించాలనీ, రోడ్డు మరమ్మత్తు పనులు చేయించాలని విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం రామకృష్ణ, ఏఈ మాజిద్, వర్క్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణ, లక్ష్మణ్, వివిధ పార్టీల నాయకులు చంద్రమో హన్, చుక్కా జగన్, మిర్యాల రవీందర్, అరుణ్ కుమార్రెడ్డి, ధార యోబు, తదితరులు పాల్గొన్నారు.