Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన ధరల ప్రకారం స్కాలర్ షిప్స్ రేట్లు పెంచాలి
- 24న విద్యార్థులు తరగతుల బహిష్కరణ కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి, ధర్నా
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పెరిగిన ధరల ప్రకారం స్కాలర్ షిప్స్ రేట్లు పెంచి పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్లో బీసీ విద్యార్థి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణ య్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్ షిప్స్ ఐదేండ్ల క్రితం నిర్ణయించినవి అని తెలిపారు. పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.20వేల స్కాలర్ షిప్స్ ఇస్తుంటే మన రాష్ట్రంలో కేవలం రూ. 5,500 మాత్రమే ఇస్తున్నారనీ, రూ.20 వేలకు పెంచా లని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీంను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ ఈ బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని కోరారు. ఫీజు బకా యిలు రూ.3,500 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. బీసీ కాలేజీ హాస్టళ్లకు గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. బీసీ సంక్షేమశాఖ దిక్కులేని శాఖగా మారిందన్నారు ఈ శాఖకు కమిషనర్ లేడు బీసీ కార్పొరేషన్‌కు ఎండీ లేదన్నారు. బీసీ గురుకుల సొసైటీకి ఐఏఎస్ లేరన్నారు. శాఖలలో సరైన సిబ్బంది లేరని తెలి పారు. బీసీ స్టడీ సర్కిల్ బడ్జెటును రూ.200 కోట్లకు పెంచి అన్ని పోటీ పరీక్ష లకు కోచింగ్ ఇవ్వాల న్నారు. ప్రతి బీసీ కుటుంబానికీ బీసీ బంధు వర్తింపజేయాల న్నారు. పూర్తి ఫీజులు, స్కాలర్ షిప్‌ల కోసం 24వ తేదీన కలెక్టరేట్లు, తహసీల్దార్ల కార్యాల యాల ముట్టడికి విద్యార్థి లోకం పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సం ఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీలపల్లి అంజి, బీసీ సంఘర్షణ సమితి నాయకులు నరసింహగౌడ్, అనంత య్య, సుధాకర్, రావులరాజు, నాయకులు దీపికబిల్లా, నిర్మల పాల్గొన్నారు.