Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పార్కుల అభివృద్ధికి కృషి చేస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం బాగ్ అంబర్పేట డివిజన్ పరిధిలోని సోమ సుందర్నగర్ లోని ఎల్లిపెద్ది సీతామహాలక్ష్మీ పార్కులో రూ.65 లక్షలతో చేపట్టనున్న పార్కు సుందరీకరణ, పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని పార్కులను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా పార్కుల్లో సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నామనీ, అందులో భాగంగానే వివిధ రకాల మొక్కలు నాటడం, పార్కుల్లో వృద్ధులు, మహిళలు కూర్చునేందుకు బెంచీలు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం, పార్కు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం, టైల్స్ పెయింటింగ్ వేయడం, పార్కు ముందు భాగంలో ఆర్చ్ నిర్మాణం వంటి అనేక పనులు చేపడుతున్నామని తెలిపారు. ఎల్లిపెద్ది సీతామహాలక్ష్మీ పార్కులో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ, నిర్ణీత గడువులోగా పనులను త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు పార్కును అందుబాటులోకి తీసుకురావాలని అధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్, స్థానిక నాయకులు మిరియాల శ్రీనివాస్, శివాజీ యాదవ్, రమేష్ నాయక్, మల్లేష్ యాదవ్, సుధాకర్, రాజేశ్వరి, నాగమణి, సత్య, అన్నపూర్ణ, వనిత, సునంద, భార్గవి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.