Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి
- పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి
- ఫిబ్రవరి 8, 9వ తేదీల్లో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-అంబర్పేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలనీ, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనీ, పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడ అభినందన్ హౌటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 8-9వ తేదీల్లో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ప్రదర్శనకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, జాతీయ నేతలు హాజరు కానున్నట్టు తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యంగాపరమైన, న్యాయపరమైన అవరో ధాలు, అడ్డంకులు ఏమీ లేవన్నారు. గత పాలకులు, కేంద్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం, బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించడం మూలంగానే ప్రమోషన్లలలో రిజర్వేషను పెట్టలేదన్నారు. రాజ్యాంగ బద్ధమైన మండల్ కమిషన్ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని తెలిపారు. అన్ని వైపుల నుంచి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉంచాలని సిఫార్సు లున్నా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. గతంలో ఈ బిల్లుకు దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా బీజేపీ ఇవ్వకపోవడంతో బిల్లు పాస్ కాలేదన్నారు. బీజేపీ బీసీ బిల్లుకు తమ విధానానిష్ట్ర్న ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ హయాంలో బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్ర కమించదని హెచ్చరించారు. లోక్ సభలో 94 మంది బీసీ లోక్ సభ సభ్యులు ఉన్నారనీ, 8 బీసీల పార్టీలు ఉన్నావనీ, పార్టీలక తీతంగా వీరు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలనీ, లేకపోతే బీసీ వర్గానికి చెందిన లోక్సభ సభ్యులకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు. ఇది రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య హక్కు అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్లో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశార న్నారు. ఉద్దేశపూర్వకంగా ఈ కులాలను అణిచివేస్తునారని చెప్పారు. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, కేంద్రంలో 27 శాతం నుంచి 50శాతానికి పెంచాలన్నారు. చట్టసభల్లో కూడా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్ల మెంటులో బీసీ బిల్లు పెట్టాలన్నారు. రిజర్వేషన్లపై విధించి న గరిష్ట పరిమితి 50 శాతంను సుప్రీంకోర్టు తొలగించి నందున ఎలాంటి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవన్నారు. కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల లో, 245 ప్రభుత్వ రంగ సంస్థలలో 16 లక్షలు ఖాళీలు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. ఒక్క రైల్వే శాఖలోనే 3 లక్షలా 53 వేల ఉద్యోగాలు, వివిధ బ్యాంకుల్లో లక్షా 30 వేల ఉద్యోగాలు, రక్షణ రంగ సంస్థలలో నాలుగు లక్షలా 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ఒక ఎమ్మె ల్యే ఎంపీ, ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వ హించాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. కానీ ఉద్యోగాల ఖాళీల విషయంలో రాజ్యాంగంలో పేర్కొనకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. పార్లమెం ట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలలనీ, బీసీ ఉద్యోగు లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలనీ, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలనీ, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వే షన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతంకు పెంచాలని కోరారు. బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలనీ, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనీ, బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలలనీ, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకరావాల నీ, ప్రపంచీకరణ, సరళీకృత, ఆర్ధిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగం లో పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చాయనీ, అందుకే ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ/ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలనీ, కేంద్రంలో బీసీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీం విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాల న్నారు. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలనీ, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్తో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలనీ, జనాభా లెక్కల్లో బీసీ కులాల వారి లెక్కలు సేకరించాలని కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నకేశవ రెడ్డికి నియామపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ జాతీయ నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంక టేష్, అంజి, సి.రాజేందర్, అనంతయ్య, రాజ్ కుమార్, నందా గోపాల్, జి.కృష్ణ యాదవ్, నిఖిల్, దీపిక, తదితరులు పాల్గొన్నారు.