Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
- విద్యార్థులకు వివేకానంద విదేశీ పథకం మంజూరు పత్రాలు అందజేత
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
గత ప్రభుత్వాలు బ్రహ్మణులు, వైశ్యుల గురుంచి పట్టించుకో లేదు అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్‌లో వివేకానంద విదేశీ పథకం కింద ఎంపికైన బ్రాహ్మణ విద్యార్థులకు ఆయన మంజూరు పత్రాలను అందజేసి మాట్లాడారు. అగ్ర వర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ స్కీములను అందుకోవడానికి కులం అడ్డు రాకూడదన్నా రు. బ్రహ్మణుల్లో కూడా పేదలు ఉన్నారనీ, వారు బాధలను బయటకు చెప్పు కోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం బ్రాహ్మణ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువు కునేందుకు, బిజినెస్ కోసం నిధులు ఇస్తున్నామన్నారు. హిందూ ధర్మం పరిరక్షణ అని కొంత మంది చెప్పుకుంటున్నారు అనీ, ధర్మాన్ని ముందుకు తీసు కెళ్లేది బ్రాహ్మణులు అన్నారు. ధర్మం కోసం అని చెప్పుకుంటున్న వారు మీ. రాష్ట్రాల్లో ఎందుకు బ్రాహ్మణులను ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయాల కోసం ఇతర మతాలను ద్వేషిస్తున్నారని చెప్పారు. గతంలో ఆలయ నిధులను ప్రభుత్వలు వాడుకున్నాయనీ, రాష్ట్రంలో యాదాద్రితోపాటు ఎన్నో ఆలయా లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. అర్చకులకు గ్రాంట్ ఇస్తూ ఆదుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఏడూ ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రూ.250 కోట్ల కేటాయిస్తున్నా మన్నారు. విదేశాలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున సాయం అందిస్తున్నామన్నారు. మీ దీవెన లు సీఎంకు ఉండాలని కోరారు. మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కె.వి రమణాచారి, తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగో పాలచారి, టీబీఎస్పీ వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్, గ్రంథాలయాల పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయచితం శ్రీధర్, బ్రాహ్మణ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.