Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో పేదల జీవితాలతో వెలుగులు నింపటానికి కృషి చేస్తున్నారని బడంగ్పేట్ మున్సిప ల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సిం హారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం నియో జకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానిక కార్పొరేటర్ మాధురి వీరకర్ణారెడ్డితో కలిసి మూడో డివిజన్లో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరే షన్ అల్మాస్గూడ 3వ డివిజన్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మే యర్ మాట్లాడారు. కంటి వెలుగు కార్యక్రమం 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు మూడో డివిజన్లో కొనసాగుతుందని ప్రతి ఒక్కరు వినియోగించుకో వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర నాయకులు రామిడి శూరకర్ణరెడ్డి, డాక్టర్లు, వైద్య సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
సరూర్ నగర్ :కంటి వెలుగు పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్కేపురం డివిజన్ బీఅర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ అన్నారు. మంగళవారం శ్రీకృష్ణనగర్ కమ్యూనిటీ హాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, డివిజన్ బీఅర్ఎస్ పెండ్యాల నగేష్తో కలిసి మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మలు పరిశీలించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కంచర్ల శేఖర్, కొండ్ర శ్రీనివాస్, పెంబర్తి శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి, అల్లావుద్దీన్ పటేల్, ఫరీద్ పాషా, దుబ్బాక శేఖర్, మహమ్మద్ షఫీ, శంకర్, శ్రీనివాస్ గుప్తా, డివిజన్ జనరల్ సెక్రెటరీలు మురళీధర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.
అంధత్వాన్ని రూపుమాపేందుకే...
ఉప్పల్: చిల్కానగర్ డివిజన్ బ్యాంకు కాలనీ కంటి వెలుగు కేంద్రాన్ని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా, ఉప్పల్ సర్కిల్ డీసీ అరుణకుమారి, ఏఎంసీ శైలజ, ప్రాజెక్టు ఆఫీసర్ రమాదేవిలతో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ అంధత్వాన్ని రూపుమాపేందుకు కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, రామానుజం, శ్యామ్, బాలు తదితరులు పాల్గొన్నారు.