Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
గౌరెల్లి గ్రామ అభివృద్ధి కోసం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి 15 లక్షల నిధులను మంజూరు చేసినట్లు జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్బర్ అలీ ఖాన్, గ్రామ సర్పంచ్ తుడుం మల్లేష్ తెలిపారు. అభివృద్ధి నిధులకు సంబంధించిన ఆర్డర్ కాపీని మంగళవారం చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి చేతుల మీదగా వారు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డికి జిల్లా కో-ఆప్షన్ సభ్యులు అక్బర్ అలీ ఖాన్, సర్పంచ్ తుడుం మల్లేష్ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.