Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
నేటి బాలికలే రేపటి మహిళలు అని నగర ప్రభుత్వ సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాలభా స్కర్ అన్నారు. ఆయన నేతృత్వంలో కళాశాల మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినో త్సవం వేడుకలు, సదస్సు నిర్వహించారు. బాలికల పరిరక్షణ, ఉన్నత విద్య, ఆవశ్యకత గురించి ఈ సద స్సులో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నేడు స్త్రీలు అన్ని రంగాల్లో ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారన్నారు. ఒక కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధికి స్త్రీలు ముఖ్యమైన పాత్ర వహి స్తున్నారన్నారు. నేటి గణాంకాలను గమనిస్తే, స్త్రీ సంఖ్య తగ్గిపోతుందనీ, అందుకే సమాజం, బాలికల ను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా జాతీయ బాలిక దినో త్సవంపై విద్యార్థులకు వక్తత్వ పోటీలను నిర్వహిం చారు. భారతదేశం తరఫున బంగ్లాదేశ్‌లో జరిగిన టార్గెట్ బాల్ పోటీలో పాల్గొన్న ఎన్సీసీ కాడెట్ శ్రీలత విద్యార్థినిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ నర్మద, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ వేదవతి, డాక్టర్ సుదక్షిణ, సుజాత, డాక్టర్ చిత్తరంజన్, డాక్టర్ శంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.
సుల్తాన్‌బజార్ : ఆశ్రిత హౌమ్ లో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా యునిసెఫ్ డేవిడ్ హాజరై మాట్లా డుతూ.. సమాజంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా జాతీయ బాలికల దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్ర మంలో అశ్రిత హౌం డైరెక్టర్ నాగరాజు, కో-ఆర్డి నేటర్ పర్వతాలు, శేఖర్, యూనిసెఫ్ ప్రతినిధులు కామాటిపుర పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్ : ఆడ పిల్లల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి వారికి చివరి నిమిషంలో చికిత్స అందించడం మంచిది కాదనీ, పిల్లలు పుట్టని పరిస్థితిలో ఫెర్టిలిటీ చికిత్సకు వచ్చినా వారు మగ పిల్లలు కావాలనడం ఆడ పిల్లల పట్ల సమాజంలో ఉన్న నూన్యతా భావానికి అద్దం పడుతోందని జాతీయ ఆడ పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్ నిర్వహించిన అవగాహనా కార్యక్ర మంలో వైద్య నిపుణుల సూచన చేస్తున్నారు. ఆడ పిల్లల సంఖ్య తగ్గడమంటే దేశ పురోగతి నెమ్మదించడ మే అన్నారు. కుటుంబాలు క్షీణించడమే అనేది నగ సత్యం అనీ, ఈ సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఎన్నో కారణాలతో ఆడ పిల్లలు పుడుతున్నారంటే కడుపులో ఉండగానే చంపడం ఒక వేళ జన్ననిచ్చినా ఇదేం ఖర్మనుకొంటూ వారిని మగ పిల్లలతో సమానంగా చూడకపోవడం సరైన చదువు చదివించకపోవడం గమనిస్తూనే ఉంటాం అని తెలిపారు. అని కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్టు గైనకాలజిస్టు, విరించి హగ్ ఫెర్టిలిటీ కేంద్రం వైద్య నిపుణులు దుర్గ పచవ, విరించి హాస్పిటల్స్ డైరెక్టర్ డా శ్యాం సుందర్ వివరించారు. ఈ పరిస్థితులన్నీ చివరకు దేశంలో ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతున్నాయన్నారు. జనాభా లో సగానికి దగ్గరగా ఉండే మహిళలు ఎందుకు పనికి రానరనే భావనతో ప్రక్కన పెట్టడం వల్ల దేశ ఆర్థిక పురోగతికి అడ్డంకిగా మారిపోతోందన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఆడ పిల్లల పట్ల చిన్న చూపునకు కారణంగా మారి పోయాయనడంలో సందేహం లేదన్నారు. ఈ అరాచకాన్ని గమనించి భారత ప్రభు త్వం ఆడ పిల్లలను కూడా సమానంగా చూడాలని, వారికి సమాన అవకాశాలు కలపించాలని, సమాన హక్కులతో వారు దేశ పురోగతిలో భాగం చేయాలనే లక్ష్యంతో జాతీయ ఆడ పిల్లల దినోత్సవాన్ని ఏటా 24 జనవరి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సాయి రవి శంకర్, ఎండీ, డా.శ్రీనివాస్ సామవేదం, ఈడీ, వి.సత్యన్నారాయణ, గ్రూపుతో పాటూ పలు వురు ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.