Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతు న్నాయని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ జూబ్లిహిల్స్ డివిజన్ అధ్యక్షులు కాటూరి రమేశ్ ఒక ప్రకటనలో తెలి పారు. అధికార ప్రజాప్రతినిధి అయి ఉండి తమ ప్రభుత్వ హయంలో ఆక్రమణలు జరుగుతున్నాయి అని ఒప్పుకోవడం సిగ్గు చేటు అనాన్నరు. ఒక ప్రజాప్రతినిధి మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించాలి అన్నారు. ఇలా పేద ప్రజలకు కేటాయించిన స్థలాలకు రక్షణ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. గతంలో పద్మాలయ, అంబేద్క ర్‌నగర్‌లో అంబేద్కర్ భవన్‌కి కేటాయించిన స్థలం కబ్జాకు గురవుతుందని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పినప్పుడు స్పందించని కార్పొరేటర్ ఇప్పుడు స్పందించడం వెనుక మతలబు ఏందో ప్రజలు ఆలోచించాలన్నారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత వారి పై ఉంది అనీ, కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురి కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.