Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
ఎల్బీనగర్ చౌరస్తాలో నూతనంగా నిర్మిస్తున్న ఫైఓవర్ను స్థానిక ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించ డానికి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా నిర్మాణమైన ఎస్ఆర్డీపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటు లోకి వస్తుందని ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ -ఉప్పల్- దిల్సుఖ్నగర్ మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు, ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాల రాకపోకలను సులువు చేసే లక్ష్యంతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర ్డీపీ)లో భాగంగా బల్దియా నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనులు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి అన్నారు. ఎస్ఆర్డీపీ ఫలాలు మహానగరానికి మహర్ధశను తీసుకొస్తున్నాయన్నారు. నిత్యం పద్మ వ్యూహాన్ని తలపించే ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెడుతూ బ్రేకులు వేయకుండా సాఫీగా సాగిపోయేలా రాచమార్గాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని సుధీర్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగా చింతలకుంట నుంచి మాల్ మైసమ్మ వరకు దాదాపు రూ.32 కోట్ల వ్యయంతో 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తిస్థాయిలో నిర్మించామన్నారు. అతి త్వరలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌చే ప్రారంభిస్తామని తెలిపారు. ఎల్.బి.నగర్ జంక్షన్‌ను ఫ్రీ సిగల్గా మార్చడమే తమ లక్ష్యమన్నారు. అలాగే ట్రయిల్ రన్ మొదలుపెట్టాలని సుధీర్‌రెడ్డి అధికారులను ఫోన్లో ఆదేశించారు. మైసమ్మగుడి దగ్గర దిగడానికి ముందే స్పీడ్ బ్రేకర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం ఇప్పటికే రెండు ఫ్లై ఓవర్లు, రెండు అండర్ పాస్‌ల కోసం దాదాపు రూ.120కోట్లు వెచ్చించామన్నారు.ఎమ్మెల్యే వెంట మధుసాగర్ తదితరులు ఉన్నారు.