Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీ నగర్
అంకుర్ హాస్పిటల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గర్భాశయ ద్వారా క్యాన్సర్ భారతీయ మహిళల్లో రెండో సాధారణ క్యాన్సర్‌గా పరిగణించబడుతుందన్నారు. మొదటిది రొమ్ము క్యాన్సర్, రెండవది గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ అన్నారు. దేశంలో గర్భాశ ముఖద్వారం ద్వారా 74వేలమంది ప్రతి సంవత్సరం మరణిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం కొత్తగా గర్భాశ ముఖద్వారా క్యాన్సర్ 1,54,000 మంది గురవుతున్నారన్నారు. హెచ్పీబీవీ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వస్తుందన్నారు. దీనిని నివారించడానికి వ్యాక్సిన్ ఉన్నదని తెలిపారు. నాన్ వాలెట్ హెచ్‌బీవీ వాక్సిన్ ద్వారా దీనిని నివారించవచ్చన్నారు. ప్యబ్ టెస్ట్ అనేది గర్భాశ ముఖద్వారా స్క్రీన్ టెస్ట్ ద్వారా తెలుస్తుందన్నారు. ఇది ఏ స్టేజిలో ఉన్నదో టెస్ట్ ద్వారా తెలుసుకోవడం ద్వారా పూర్తిగా ద్వారా నివారించవచ్చని తెలిపారు.