Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా పోచారం మోడల్ స్కూల్‌ను మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోచారం మున్సిపల్ పరిధిలోని పోచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 7.34 లక్షల ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలైన మూత్రశాలలు ప్రహరీ గోడ, టాయిలెట్స్ పెయింటింగ్, బెంచీలను పరిశీలించారు. అనంతరం నార్సరీని పరిశీలించి పోచారం మున్సిపాలిటీ ప్రగతి నివేదిక 2020-2023 పుస్తకాన్ని చైర్మన్ అందించారు. ఈకార్యక్ర మంలో చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి, కమిషనర్ సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజిత, కౌన్సిలర్ సమాల శ్రీలత, ఏఈ నరేష్, నాయకులు బద్దం జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.